fake Swamiji arrested : స్వామిజీ రతి లీలలు: భక్తుల భార్యల్ని రప్పించుకుని కామకేళి | Oneindia Telugu

2017-09-28 1

A fake Swamiji who is cheating people in the name of jyothisham was arrested on Wednesday in Hyderabad.

ఆధ్యాత్మికత, భక్తి ముసుగులో రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. అమాయక జనం నమ్మకమే పెట్టుబడిగా తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న రీతిలో వారి బాగోతాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా బాబాల ఆగడాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. మరో స్వామిజీ లీలలు బయటపడ్డాయి. బాలాపూర్ అయోధ్యనగర్ కు చెందిన వెంకట లక్ష్మీనరసింహాచార్యులు జ్యోతిష్యుడిగా పేరు సంపాదించాడు. పలు టీవి ఛానెళ్లలో జ్యోతిష్య కార్యక్రమాల ద్వారా పాపులర్ అయ్యాడు. అలా ఎంతోమంది అమాయకులను ఆకర్షించి.. వారి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి లక్షల్లో డబ్బు గుంజాడు.